"Rajiv Gandhi Birth Anniversary Celebrated Grandly in Mulugu"
ములుగులో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
#రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు
ములుగు, జిల్లా నేటిధాత్రి:
భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయతి వేడుకలు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ పాల్గొని ఈ కార్యక్రమంలో వారు దేశానికి చేసిన సేవల గురించి స్మరించుకుంటూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా,రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు,మండల నాయకులు ,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు,అబిమానులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
