రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి
– ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక రకాల రాయితీలను కల్పిస్తుందని, రైతులు ప్రభుత్వం కల్పించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్‌రావు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవిందర్ రావు ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగ విత్తనాలను ప్రభుత్వం 65శాతం రాయితీ ఇస్తుందని, కిలో జీలుగ విత్తనాలను 18రూపాయలకే అందజేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. 51రూపాయలు ఉన్న కిలో జీలుగ విత్తనాలకు ప్రభుత్వమే 33రూపాయలు చెల్లిస్తోందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులను ఆగ్రోస్ సంస్థలో ఇచ్చి విత్తనాలను సబ్సిడీ ధ్వారా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి అడుప కవిత, సర్పంచ్‌లు జన్ను కుమారస్వామి, ఆడెపు దయాకర్, ఎంపీటీసీ పెండ్లి కావ్య తిరుపతి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ మజ్జిగ జయపాల్, ఉపసర్పంచ్‌లు అడ్డగూడి సతీష్, కొట్టం రాజు, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మునిగాల సంపత్, సీనియర్ నేతలు తండా వెంకన్న, బొల్లపల్లి పరమేశ్వర్, పెండ్లి మల్లారెడ్డి, పెండ్లి ఆగారెడ్డి, అమరవాది రవికుమార్, డబ్బా శ్రీనివాస్, గూడ లింగారెడ్డి, బుర్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.