రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ
రైతే రాజు అనే నినాదాన్ని నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నరేంద్ర మోడీ రెండోవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పధకం ద్వారా 5ఎకరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకి కుడా వర్తించేలా నిర్ణయం తీసుకున్న సందర్బంగా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పుల్యాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయం వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతు నరేంద్ర మోడీ 5సంవత్సరాల స్వచ్చమైన పాలన అందించి మరోమారు ప్రజలమోదం పొంది భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి నిర్ణయంగా రైతులకు భరోసా కల్పిస్తూ గతంలోని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకంలోని 5ఎకరాల స్లాబును తీసివేసి ప్రతి ఒక్క రైతుకు కుడా ఈ పథకం వర్తించేలా చేస్తూ రైతులకు బరోసా కల్పించారన్నారు. అదేవిధంగా 60సంవత్సరాలు నిండిన ప్రతి రైతు నెలకు 3వేల రూపాయిల పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం కేవలం నరేంద్ర మోడీకే సాధ్యమైయిందని తెలిపారు. భారతదేశ చరిత్రలో రైతుల సంక్షేమం ఈ ప్రభుత్వం చేయని విధంగా దేశంలో 60శాతం ఉన్న రైతులకు భరోసా కల్పిస్తూ నరేంద్ర మోడీ ఇలాంటి పధకం ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గండ్రతి యాదగిరి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారేపల్లి రామచంద్రరెడ్డి, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధానకార్యదర్శులు కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్, బీజేపీ వరంగల్ అర్బన్ రాష్ట్ర, జిల్లా నాయకులు మండల సురేష్, పాశికంటి రాజేంద్రప్రసాద్, గంకిది శ్రీనివాస్‌రెడ్డి, గురజాల వీరన్న, కందగట్ల సత్యనారాయణ, సారంగపాణి, జన్ను ఆరోగ్యం, నానునాయక్, దామెర సదానందం, కేసోజు వెంకట్, కల్లూరి పవన్, గూడెం రవితేజ, రాజేష్‌ఖన్నా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.