Railway Approves Additional Access Road at Tirupati RUB
*రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్‌కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం..
తిరుపతి(నేటిధాత్రి)నవంబర్
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలితంగా తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపుకు మాత్రమే యాక్సెస్ రోడ్డు ఉండగా ఇందుకు అదనంగా ఎడమ వైపుకు వైపుకు అనగా రేణిగుంట వైపు యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఆమోదం లభించింది.
తిరుపతి నగర విస్తరణతో ట్రాఫిక్ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్‌కు పాత హీరోహోండా షోరూం వద్ద రైల్వే గేట్ నంబర్ 107 వైపు మాత్రమే యాక్సెస్ ఉండటంతో భవిష్యత్తులో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముందుచూపుతో ఎంపీ గురుమూర్తి గుర్తించారు. అందుకే కాటన్ మిల్ గేట్ నంబర్ 108 వైపుగా కూడా అదనపు యాక్సెస్ రోడ్డు అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీ వాస్తవ కి లేఖ రాశారు.
ఎంపీ ప్రతిపాదనపై రైల్వే శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన జరిపి యాక్సెస్ రోడ్డు ఏర్పాటు సాధ్యమని తేల్చింది.ఈ మేరకు రైల్వే జీఎం ఎంపీకి లేఖ ద్వారా సమాచారం అందించారు.
ఈ నిర్ణయంతో తిరుపతి–రేణిగుంట మార్గం నుండి మంగళం, లీలామహల్ సర్కిల్ వైపుకు వాహనాలు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
