భట్టికి రాహుల్ ప్రాధాన్యత…ఒకే కారులో గన్నవరంకు..మంతనాలు

Khammam Janagarjana Sabha  Update :

ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో గన్నవరం వరకు వెళ్లారు. పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేసారు.

ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట…కార్యకర్తలంతా ఒకే సభ అన్నట్లుగా నిర్వహించటం పైన రాహుల్ హ్యాపీ ఫీలయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణంకు చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.

రాహుల్ ఇదే సభలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు అంటూ చెబుతున్న సమయంలో సభలో హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి. సభ ప్రాంగణంకు చేరుకున్న సమయం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవలాను వివరించారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పైన ఖమ్మం వేదికగా గర్జించారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు.

ఎదుర్కోవటం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న అంశాలు.. పార్టీలోని పరిస్థితుల పైన భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!