మాజీ సీఎం కేసీఆర్ మాటలకు ఆకర్షడైనా మహేష్ యాదవ్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామం తాజా మాజీ సర్పంచ్ ఉద్దామరి మహేశ్ యాదవ్ తన పదవి కాలం అయిపోయినాక గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో ముందున్నాడు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ శభాష్ అనిపించుకున్నాడు సర్పంచి గా పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వం పనులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయంతో పేదల కోసం ప్రత్యేక సేవ కార్యక్రమాలు నిర్వహించేవాడు ప్రస్తుతం సోమనపల్లి సుబ్బక్కపల్లె గ్రామాల మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ముండ్ల పొదలు పెరిగాయి ప్రత్యేక అధికారుల పాలనలో ఎటువంటి పనులు కావడం లేదు దీంతో తాజా మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్ రంగంలోకి దిగారు ప్రయాణికులు స్కూల్ పిల్లలు ఇబ్బందిని గుర్తించి పిచ్చి మొక్కలను ముండ్ల పోతలను జెసిపి సహాయంతో తొలగించడం రోడ్డుపై భారీ వర్షంతో అనేక గుంతలు ఏర్పడడం జరిగింది గుంతలలో మొరం పోయించి చదును చేయించి తనకు ప్రజాసేవపై ఉన్న మక్కువను చాటుకున్నాడు ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నీ మర్యాదగాక పూర్వకంగా కలిసినప్పుడు ప్రజాసేవ అనేది పదవుల కోసం కాదు ప్రజల మధ్యలో తరతరాలుగా నిలిచిపోయేదని మాజీ సీఎం కెసిఆర్ చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తమ గ్రామం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడడం జరిగింది నూతన రాష్ట్రాన్ని కెసిఆర్ ఏ విధంగా అభివృద్ధి చేసి చూపారు. నూతనంగా ఏర్పడిన తమ గ్రామం పంచాయతీ కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేశారని భవిష్యత్తులో కూడా పదవులు ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేస్తూ తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మహేష్ తెలిపారు అటుగా వెళ్లే గ్రామాల వాహనదారులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు