భద్రాచలం నేటి ధాత్రి
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పూణెం లింగన్న 5వ వర్ధంతి చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెంలో సభ నిర్వహించడం జరిగింది.
అనంతరం న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షతన జరిగిన సభ కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ లింగన్న విప్లవద్యమంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహించి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించాడని వారన్నారు.కామ్రేడ్ లింగన్న కూడు గూడు నీడ లేని పేదలని ఐక్యం చేసి భూమి లేని పేదలకు భూమి పంచాడని ఎన్నో గ్రామాల నిర్మాణం చేశాడని ఆ క్రమంలోనే దోపిడిదారులు పెట్టుబడిదారులపై పోరాటం నేర్పాడని మోసం చేస్తున్న వ్యాపారస్తులని సమన్వయంతో కూర్చోబెట్టి మాట్లాడాడని ఆయన అన్నారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి నిర్మాణం చేసి ప్రజలని ప్రతిఘటన పోరాటం వైపు మళ్ళించాడని చంద్ర పుల్లారెడ్డి వారసత్వంతో ఆయన పోరాటం చేశాడని వారు అన్నారు. లింగన్నను పట్టుకొని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ చిత్రహింసల గురిచేసి కాల్చి చంపారని దానికి కారణం కన్జ సంపదపై కన్వేషణ కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యం ఒకటే ఈ బూటకపు ఎన్కౌంటర్ చేశారని వారు అన్నారు.లింగన్న ఆశయాల సాధన కోసం పోరాడాలని,అపుడే నిజమైన నివాళి అని వారు అన్నారు.అనoతరం కామ్రేడ్ లింగన్న కు సంతాపం ప్రకటించి మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇర్ఫా సమ్మక్క మండల నాయకురాలు బుర్ర సమ్మక్క గౌరారం నాయకురాలు బుద్ధుల సమ్మక్క ఆదిలక్ష్మి సబ్కా నాగేష్ రాజు రమేష్ చర్ల దోమగూడెం ప్రజలు పి ఓ ఎల్ నాయకులు శ్యాంసుందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు