Financial Aid to Bereaved Family
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన రామిండ్ల యాదగిరి వయసు 35 సం:: బుధవారం రోజున అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ బిఆర్ఎస్ నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్తలతో మృతిని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు. నియోజకవర్గం లోఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న కంటరెడ్డి తిరుపతిరెడ్డికి టిఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ఎక్కడ ఏ చిన్నపాటి కష్టం ఎవరికైనా వచ్చిన వెంటనే స్పందించి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న తిరుపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గయ్య, ఎల్లం యాదవ్,మంగలి నరసింహులు ఎండి హబీబ్, మెట్టు లింగం, మెట్టు బాలయ్య,మెట్టు రాజు, పంగ రాజు, మన్నె రవి, బాల నర్సు, తదితరులు పాల్గొన్నారు.
