ఆపదలో ఉన్న చిన్నారికి ఆర్థిక సహాయాన్ని అందించండి
పట్టణం లోని 2002-2003 పదవతరగతి బ్యాచ్ తరపున ఆర్థిక సహాయం.
చెన్నూర్, నేటి ధాత్రి:
చెన్నూర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని బట్టిగూడెం కాలనీకి చెందిన పాలితపు సురేష్ సుకన్య ల పుత్రిక చిన్నారి పాలితపు ఇషిక కు జ్వరము మెదడుకు చేరడముతో హైదరాబాద్ లోనీ రెయిన్ బో పిల్లల ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. వైద్యపరీక్షలలో మెదడు వాపు వ్యాధికి గురి అయినందున ఇప్పటికే 5 లక్షలు ఖర్చు అయ్యాయి.ఇంకా 4లక్షలు వైద్యానికి కర్చు అవుతుంది అని డాక్టర్స్ చెప్పడం తో అపన్నా హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.విషయం తెలుసుకున్న పట్టణం లోని 2002-2003 10 వ తరగతికి చెందిన బ్యాచ్ వారి ఇంటికి వెళ్ళి ఆర్థిక సహాయం నిమిత్తం రూ. 11,000- అంద జేశారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే పెద్ద హృదయం తో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి చిన్నారిని కాపాడాలని కోరారు. కార్యక్రమం లో కౌన్సిలర్ రేవెల్లి మహేష్, బొడ్డు మహేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.