పరకాల నేటిధాత్రి
భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపట్ల పరకాల పట్టణ బిర్ఎస్ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పరకాల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శ్రీను అన్నారు.ఈ సందర్బంగా శ్రీను మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచి,తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి,దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు.సంస్కరణల పితామహునిగా పేరుపొంది, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత పివి నరసింహారావుదే అని కొనియాడారు.పీవీ చేసిన ఆర్థిక సంస్కరణ వల్లనే నేడు దేశంలో సాంకేతిక విప్లవం కొనసాగుతుందని అన్నారు.పీవీని గుర్తించి భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.పీవీ కి భారత రత్న ప్రకటించాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని అన్నారు.
తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ కి భారతరత్న ఇవ్వడం గర్వకారణం-డాక్టర్ మడికొండ శ్రీను
