నర్సంపేట కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట కోర్టులో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు.వరంగల్ కోర్టు న్యాయవాది గంధం శివపై పోలీసులు అకారణంగా దాడి చెసి కొట్టారని అట్టి పోలీసులను వెంటనే విడులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి,కార్యదర్శి శిలువేరు కిరణ్ కుమార్,ఏజిపి కోడిదెల సంజయ్ కుమార్,సీనియర్ న్యాయవాదులు తండ సారంగపాణి,తొగరు చెన్నారెడ్డి,దొంతి సాంబయ్య,మోటురి రవి,ఠాకూర్ సునీత,అంబటి రాజ్ కుమార్,జన్ను మహేందర్,కంసాని అశోక్,నాగుల రమేష్,కందకట్ల వీరేష్ తదితరులు ఉన్నారు.