ఏఐటీయూసితోనే సింగరేణికి రక్షణ..

కార్మిక హక్కుల సాధనకు నిరంతరం పోరాటం

లాభాల వాటా సాధించిన ఘనత ఏఐటీయూసీదే

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి రమేష్

ఏఐటీయూసీలో భారీ చేరికలు.

భూపాలపల్లి నేటి ధాత్రి

శుక్రవారం భూపాలపల్లి కేటీకే 5 ఇంక్లైన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మిక పోరాటాల ద్వారా గతంలోని ఏఐటీయూసీ అనేక హక్కులను సాధించి పెట్టిందని అన్నారు. ఏఐటీయూసీ గతంలో సాధించిన చట్టాలనే ఇప్పుడున్న మన కార్మికులు అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. టీబీజీకేఎస్ గెలిచిన పది సంవత్సరాలలో స్ట్రక్చర్ మీటింగులు నిర్వహించకుండా కార్మిక హక్కులను కాల రాసిందన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండి గడిచిన అనేక సంవత్సరాలలో వారు చేసింది ఏమున్నదని ప్రశ్నించారు. నూతన గనుల విషయం లో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అన్నారు. ఏఐటీయూసీ ద్వారానే అనేక హక్కులు సాధించామని ఒక్క తెలంగాణ ఇంక్రిమెంట్ తప్ప టీబీజీకేఎస్ చేసింది ఏం లేదని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాలకు కూడా పైరవీలతో కార్మికుల వద్ద డబ్బులు దండుకున్న ఘనత టీబీజీకేఎస్ దే అని అన్నారు. ఐ ఎన్ టి యు సి కార్మిక వర్గాలకు గతంలో కూడా చేసిందేమీ లేదని అన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వారే కానీ కార్మికుల పక్షాన ఏనాడు ఐఎన్టియుసి పోరాడిన పరిస్థితులు లేవన్నారు. కార్మిక హక్కులను కాలరాశి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను హరించి వేసిన బి ఎం ఎస్ సంఘం కార్మికుల పక్షాన పని చేస్తుందా అని కార్మికులు ఆలోచించాలని తెలిపారు. గతం నుండి ఇప్పటివరకు సుమారు 80 ఏళ్ల చరిత్రలో అనేక కార్మిక చట్టాలను హక్కులను సాధించింది ఏఐటీయూసీ మాత్రమే నని అన్నారు. 1964 లోనే బోనస్ చట్టం, పెన్షన్ చట్టం తెచ్చి కార్మికులకు బోనస్ ఇప్పించిన ఇప్పించిన చరిత్ర ఏఐటీయూసీ దే అన్నారు. నిరంతరం కార్మికుల పక్షాన కార్మికుల మేలుకోరే ఏఐటీయూసీని ఈనెల 27న జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్టార్ చుక్క గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని రమేష్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వివిధ కార్మిక సంఘాలలో పనిచేసిన 100 మంది కార్మికులు, నాయకులు ఏఐటీయూసీ లో చేరారు. వారికి బ్రాంచి కార్యదర్శి రమేష్ కండువాలు కప్పి ఏఐటీయూసీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఫైవ్ ఇంక్లైన్ ఇంచార్జ్ ఆసిఫ్ పాషా, ఫిట్ సెక్రెటరీ దోర్నాల తిరుపతి, అధ్యక్షత వహించిన
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు మాతంగి రామచందర్,జి శ్రీనివాస్ ,చంద్రమౌళి ,రవి కుమార్ ,జి తిరుపతి ,మల్లికార్జున్ మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ తోట రామ్ చందర్ అసిస్టెంట్ ఫిట్ ఇంచార్జ్ లు నాగేంద్ర బాబు,కుమార్,నల్ల సత్తి ,రాజేందర్,ఎస్ తిరుపతి,కే శ్రీనివాస్,చంద్రయ్య వీరన్న,రమేష్,బి
శ్రీనివాస్,టి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి,రాయమల్లు ,సమ్మిరెడ్డి,నరసయ్య , ప్రేమ్ మార్, రాంచందర్, ప్రవీణ్,వంశీ, రాజు,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!