# టీజేఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ అంబటి శ్రీనివాస్
నర్సంపేట , నేటిధాత్రి :
ఎన్నికల సమయంలో ఉద్యమకారులకై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ అంబటి శ్రీనివాస్ అన్నారు.టీజేఎస్ పార్టీ నర్సంపేట డివిజన్ కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాలతోపాటు 25 వేల పెన్షన్ విధానాన్ని , విద్యా వైద్యంలో ఉచిత ఉచిత సేవలు అలాగే ఉచిత రవాణా సౌకర్యం పాసులు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులుగా ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇస్తూ వారికి ప్రతి ప్రభుత్వ శాఖలలో గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ ఫలాలలో ప్రత్యేక అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల డిమాండ్లను అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్ గౌడ్, సోల్తి సాయికుమార్, మహమ్మద్ సందాని, సాంబరాతి మల్లేశం, గుంటి సంజీవ తదితరులు పాల్గొన్నారు.