రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ జెండా కోసం ఎంపీ నిధుల నుండి విడుదల చేసిన మూడులక్షల ప్రొసీడింగ్ కాపీని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్ ఆధ్వర్యంలో అందచేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్. ఈసంధర్భంగా వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, నేచర్ యూత్ క్లబ్ అధ్యక్షులు కాసరపు పర్శరాం, నేచర్ యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.