అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

పట్టణ గురుకుల పాఠశాలల (యుఆర్ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: హెచ్.సూర్య కిరణ్

హైదరాబాద్,నేటిదాత్రి

రాష్ట్రంలోని అనాధ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులు మధ్యలో బడి మానేసిన బాలురు హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ గురుకుల పాఠశాలల యు ఆర్ ఎస్ ను 2017-18 విద్యా సంవత్సరంలో స్థాపించింది. ఇంగ్లీష్ మీడియం లో యుఆర్ఎస్ ను ప్రారంభించింది. స్కూల్స్ ని ప్రారంభించినప్పుడు వాటిలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అయితే 2017 లో ప్రారంభించిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక యుఆర్ఎస్ నీ ప్రారంభించాలని నిర్ణయించింది. 2017 లో అడ్మిషన్లు తీసుకున్న సమయంలో 8 వ తరగతి వరకే అడ్మిషన్ తీసుకున్నారు, పాఠశాలల్లో మొత్తం 120 మంది విద్యార్థులను తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 29 యుఆర్ఎస్ స్కూలు కొనసాగుతున్నాయి వాటిలో సుమారు 3000 మంది విద్యార్థులు ఉన్నారు 2017లో యుఆర్ఎస్ స్కూల్స్ తో పాటు బాలికల కోసం 84 కేజీబీవీలను కూడా ప్రారంభించారు. వాటిలో కూడా 2017లో 8వ తరగతి వరకు అడ్మిషన్ తీసుకోగా ఆ తరువాత వాటిని తొమ్మిది 10 తరగతిలో పాటు ఇంటర్మీడియట్ వరకు అప్డేట్ చేశారు కానీ యుఆర్ఎస్ స్కూల్స్ ని మాత్రం 2017నుంచి ఇప్పటివరకు కూడా గత ఆరు సంవత్సరాలుగా ఎనిమిదో తరగతి వరకే విద్యార్థులను అడ్మిషన్ తీసుకుంటున్నారు. 8వ తరగతి ముగిసిన తర్వాత యుఆర్ఎస్ లో చదివిన విద్యార్థులు తిరిగి డ్రాపౌట్ అవుతున్నారు.అందుకు కారణం వారిని తొమ్మిది,పది తరగతులలో సాధారణ సంక్షేమ హాస్టల్లో ఉంచి సంబంధిత ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని సూచిస్తున్నారు.దీంతో అప్పటివరకు రెసిడెన్షియల్ విధానంలో విద్యాబ్యాసం పొందిన విద్యార్థి సాధారణ సంక్షేమ హాస్టల్లో ఇమడలేక తిరిగే డ్రాప్స్ అవుతున్నట్లు వారికి బోధన చేసే ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రులు సైతం చెబుతున్నారు.ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఊర్లో పాఠశాలలు ఉండాలని ఒక విద్యార్థి కూడా పాఠశాలకు పోకుండా ఉండకూడదని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో యుఆర్ఎస్ స్కూల్స్ ని కనీసం వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచైనా 9 వ తరగతి అనుమతించి ఆ తరువాత సంవత్సరంలో 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి కి అనుమతి ఇస్తే డ్రాప్ అవుట్స్ కాకుండా విద్యార్థులు కనీసం పదవ తరగతి వరకు విద్యను కొనసాగించే అవకాశం ఉంటుంది.అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రారంభం కాని రంగారెడ్డి,నారాయణపేట్,మహబూబాబాద్,ములుగు నాలుగు (4)జిల్లాల్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించగలరని రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మనవి చేస్తున్నాము.ప్రస్తుతం నడుస్తూన్న 29 జిల్లాల్లోని యుఆర్ఎస్ లలో కేజీబీవీ ల వలే పూర్తి స్థాయి స్టాఫ్ పాటర్న యుఆర్ఎస్ ల లో మంజూరు చేయాలని, మహిళ ఉద్యోగులకు కేజీబివిల వలే వేతనం తో కూడిన మేటర్నిటీ లీవ్స్ ఇవ్వగలరని సూర్య కిరణ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!