ప్రైవేట్ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇంచార్జ్ మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్‌కు 6నుండి 7వేల రూపాయలు ఇస్తూ అక్రమంగా అడ్మిషన్లు కొంటూ విద్యవ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు వారి ఇష్టం వచ్చిన కాలేజీలో చేరుతుంటే వారికి డబ్బుల ఆశ చూపి కాలేజీలకు లాక్కుంటున్నారన్నారు. దీని వలన పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఈ కాలేజీలపై వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, ఎగ్జిమినేషన్ కంట్రోలర్ మహేందర్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశాంత్, గణేష్‌స్వామి, బరత్, ప్రభాస్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.