
Primary Health Center
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అకస్మికంగా తనిఖీ
మందమర్రి నేటి ధాత్రి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మందమర్రి పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దీపక్ నగర్ ను అకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు వైద్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస డాక్టర్ జాన్వి సురేఖ మోహన్ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట సాయి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్యరక శాఖ అధికారి మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు వారి ఆధీనంలో ఉన్న ఉపకేంద్రములతో వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశించినారు అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ఎమ్మెల్యేస్ వీలు సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని ప్రభావిత ప్రాంతాలలో మున్సిపల్ వార్డులలో వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు వైద్య శిబిరంలోని ఏర్పాటు చేయాలని అదేవిధంగా వైద్యాధికారులు మందమర్రి మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ కీటకజనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటిది ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినాడు అదేవిధంగా వైద్య సిబ్బంది ఈ వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలని తీసుకోవాలని ఈరోజు నుండి ఏడు రోజులపాటు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల సందర్భంగా తల్లులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు అదేవిధంగా అర్బన్ ఆరోగ్య కేంద్రం పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి వైద్య శిబిరంలో ఏర్పాటు చేయాలి వంట చేసేవారు వంటగదిని వంట సామాగ్రిని వంట రూ ములను పర్యవేక్షణ చేసి తగు సూచనలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినారు ఈ నెల రోజుల గర్భవతులు
ఈటీడీలు నమోదు చేసుకుని వారి వివరములను ఉంచుకొని రోజువారిగా సమీక్ష చేసుకోవాలి అదేవిధంగా ఫాలో చేసుకోవాలి అసంక్రమణ వ్యాధులు 30 సంవత్సరములు పైబడిన వారందరికీ పరీక్షలు చేయడము వాటి వివరములను ఆన్లైన్లో నమోదు చేయడము మందులు అందుబాటులో చేయడం చేయాలని ఆదేశించినారు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న అవగాహన కార్యక్రమాలు ఐఇసి ఆక్టివిటీస్ పైన సంతృప్తి ఎక్సెల్ చేసినారు