
వనపర్తి నేటిధాత్రి
కేబినెట్ సమావేశంలోనే ఇచ్చిన హామీకి కట్టుబడి ముఖ్యమంత్రి వికలాంగుల కు పింఛన్లు 6000 వే లకు పెంచాల ని
కొమ్ము చెన్నకేశవులు మహాజన్ ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు డిమాండు చేశారు
వికలాంగుల సమస్యను పట్టించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన వికలాంగుల.తరుపున గుణపాఠం చెప్తామని అయిన తెలిపారు
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వికలాంగుల సమావేశం లో
గంధం గట్టయ్య మాదిగ
ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల
వికలాంగుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నాయకులు సమావేశంములో మాట్లాడారు . 6000/- వేల ఫించన్ సాధన కోసం, వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విహెచ్ పి ఎస్ వనపర్తి జిల్లా సదస్సును ఏర్పాటు
చేయాలని కోరారు
నూతన కమిటీల నిర్మాణాలు గ్రామ స్థాయిలో వికలాంగుల ఉద్యమాన్ని బలోపేతం చేయడం హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్దం చేయడానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చిం చారు
జిల్లా వికలాంగుల విభాగాన్ని సమన్వయం చేయడం కోసం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నూతన కమిటీలను నిర్మించడం కోసం సమన్వయ కమిటీని నియమించి జూలై 5న వికలాంగులకు 6000 వేలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు గీత కార్మికులకు 4000 పింఛను సాధనకై జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యలయం ముందు ధర్నా ఉంటుందని జయప్రదం చేయాలని వికలాంగులు పిలుపుచ్చారు. జిల్లాలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జులై 7న ఎమ్మార్పీఎస్ 30 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవ “కవాతు”గ్రామ గ్రామాన దండోరా జెండా ఆవిష్కరణలు విజయవంతం కోసం అన్ని వర్గాల ప్రజలు ను భాగస్వామ్యం కావాలని నిర్ణయిం చారు
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘము మాజీ రాష్ట్ర నాయకులు బీమ
ప్రభాకర్ శెట్టి
వికలాంగుల హక్కుల పోరాట సమితి వనపర్తి జిల్లా కన్వీనర్
గంధం కృష్ణయ్య వి హెచ్ పి ఎస్ వనపర్తి జిల్లా నాయకులు
గంధం లక్ష్మయ్య
వి హెచ్ పి ఎస్
సీనియర్ నాయకులు
కుశ కుమార్ శెట్టి
వి హెచ్ పి ఎస్ నాయకులు నాగరాజు కురుమూర్తి
తదితరులు పాల్గొన్నారు