ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 01
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశం గురించి చర్చించునకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం హబ్సి గూడ లో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి , తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి , ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాసరావు , కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ , ముఖ్య నాయకులు, ఉద్యమకారులు హాజరైనారు.
ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము..
అలాగే అతి త్వరలో జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లో మన బిఆర్ఎస్ అభ్యర్ధిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..