ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం
ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ నరేష్, డాక్టర్ రాహిల్ మాట్లాడుతూ నేడు కీటక జనిత వ్యాధుల నియంత్రణా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మలేరియా వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే ప్రపంచంలోని దేశాల ధ్యేయమని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే మలేరియా వ్యాధి వ్యాప్తిచెందకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఇళ్లలో దోమ తెరలను వాడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో వెంకటాపురం, ఎదిరా పిహెచ్‌సిల వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.