ప్రజలు కోరుకున్న వ్యక్తులకే అవకాశం
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు, మండల ప్రజల కోరుకున్న వ్యక్తులకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని జడ్పిటిసి పాలకుర్తి సారంగపాణి అన్నారు. శనివారం ఎన్నికల అభ్యర్ధుల పరిశీలన కోరకు ఆయా గ్రామాల పార్టీ ఇంచార్జీలతో కలిసి స్థానిక ప్రజలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్ధుల పరిశీలనలో భాగంగా మండలంలో చెన్నారం, కాశగూడెం, నల్లబెల్లి, ఇల్లంద గ్రామాలలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజల మధ్య ఉంటూ పార్టీ కొరకు, రాష్ట్రం కొరకు ఉద్యమంలో పాల్గోన్న నాయకులకే అవకాశాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసిఆర్ పాత్రను ప్రజలు మరువలేరని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్గం భిక్షపతి, ఆయా గ్రామాల ఎన్నికల ఇంచార్జులు యండి రహీం, సమ్మేట యాదగిరి, అన్నమనేనీ మోహన్‌రావు, యండి అన్వర్‌లతోపాటు సర్పంచ్‌లు భాస్కర్‌రావు, ముత్యం దేవేంద్రసంపత్, సుంకరి సాంబయ్య, పార్టీ నాయకులు ఉన్నారు.