ఐనవోలు (వర్ధన్నపేట), నేటిధాత్రి: కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూనే వారు సంతృప్తి చెందుతున్నారు. స్థానికంగా మార్నేని వంశస్థులు చేసిన ప్రజాసేవను వారసత్వంగా స్వీకరించి సమాజసేవలోనే తరిస్తున్నారు. రాజకీయ జీవితంలో నిజమైన నాయకత్వ లక్షణాలతో ప్రజల గుండెల్లొ నిలిచిన ఎంపిపి మార్నేని రవిందర్‌రావు సేవలు మరోమారు ప్రజలు ముక్తకంఠంతో కోరకున్న తరుణంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి అవకాశం మహిళలకు రావడంతో సేవ చేయడానికి ప్రజల కోరిక మేరకు ఎంపిటిసి బరిలో ఉన్న మార్నేని మధుమతి రవిందర్‌రావుతో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ
నేటిధాత్రి ప్రతినిధి: మార్నేని కుటుంబం నుండి ప్రజాజీవితంలో రెండు దశాబ్దాల కాలంగా ఉన్నారు.ప్రస్తుతం అభ్యర్ధిగా పోటిలో ఉన్నారు ప్రజల స్పందన ఎమిటి?
మధుమతి రవిందర్‌రావు: మార్నేని వంశంలో సభ్యురాలిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తా.ఎందుకంటే సమాజసేవలో ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసే అదృష్టం దక్కింది. చిన్నతనం నుండే సమాజసేవ గురించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల గురించి అవగతం చేసుకునే అవకాశం మా కుటుంబం నుండే వచ్చింది. మా తల్లిదండ్రులు కూడా ప్రజాక్షేత్రంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా ఉండడం వలన ప్రజాసేవలో ప్రత్యక్ష అనుభవం ఉంది. మార్నేని కుటుంబంలోకి సభ్యురాలిగా వచ్చిన దగ్గర నుండి మరింత దగ్గరగా ప్రజలతో ఉండే అవకాశం నాకు దొరికింది.నా జీవితంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక అభ్యర్ధిగా పోటిలో ఉన్న విషయానికొస్తే నా అభ్యర్ధిత్వం నేను కోరుకున్నది కాదు స్థానిక ప్రజలు నేను ఇంతకాలం వారికి చేసిన సేవలు ప్రత్యక్షంగా చేసేందుకు నాకు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నా.నేను పోటి చేసేది పదవుల కోరకు ప్రజాసేవను మరింత బాధ్యతగా స్వీకరించడానికి. వారు కోరి ఇచ్చిన అభ్యర్ధిత్వం కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గోన్నారు. వారి అభిమానమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
ప్రతినిధి:ప్రజలు మీ నాయకత్వాన్ని కోరకోవడం గురించి మీ అభిప్రాయం ?
మధుమతి రవిందర్‌రావు: ప్రజలకు ఇంతకాలం చేసిన సేవయే నన్ను నాయకత్వ విషయంలో ప్రతిపాధించేలా చేసింది. వారు నా నుండి కోరకుంటున్న సేవ విషయంలో మరింత బాధ్యతగా ఉంటాను. సాధారణ గృహిణిగా ఉన్నప్పటికి నాభర్త ఇంతకాలంగా చేస్తున్న సమాజ సేవలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో మండల కేంద్రం నిలిచిపోకూడదనే అభిప్రాయంతో నాపై నమ్మకంతో ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని పోదడం పట్ల నేను చేసిన సేవలకు లభించిన నమ్మకం. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను.
ప్రతినిధి:ప్రజలు ఆశిర్వదిస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏమిటి.?
మధుమతి రవిందర్‌రావు: ఎంతోకాలంగా ప్రజలు కోరుకున్న ఐనవోలు గ్రామం మండలంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మండల వ్యవస్థకు అవసరమైన అన్ని వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. స్థానికంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం. స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం. పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిల సహకారంతో అభివృద్ధి కోరకు అవసరమైన నిధులు తీసుకువచ్చి ఆదర్శమండల కేంద్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.