ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?
వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్‌జిల్లా ప్రదాన కార్యాలయంలో పగలంతా సిబ్బంది తమ విధులు ముగించుకొని వెళ్లగానే, కార్యాలయంలోకి రాత్రివేళలో ఓ ఇద్దరు వస్తున్నారని వారు అక్కడే మకాం పెడుతున్నారని, ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? వారు రాత్రి అవగానే ఎందుకు వస్తున్నారు..కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి అయ ఉంటాయ..ఆ రెండు పరుపులు వారిద్దరు పడుకోవడానికే తెచ్చుకొని ఆఫీస్‌లో పెట్టుకున్నారా? ఆఫీస్‌ను తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా వాడుకుంటున్నారా? ఇంటర్మీడియట్ వ్వవస్థకు సంబందించిన చాలా ముఖ్యమైన సమాచారం ఉండే కార్యాలయంలో ఈ విదంగా పడుకోటమేంటనే సందేహాలు, ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి.
రాత్రివేళలో మకాం పెడుతున్నది ఎవరు
కార్యాలయంలోని సిబ్బంది పగలంతా పనులు ముగించుకొని వెళ్లిన తర్వాత రాత్రి అయితే చాలు ఓ ఇద్దరు కార్యాలయంలోనే పడుకుంటున్నారని చుట్టు ప్రక్కల వాళ్లు, అటు ఇటుగా వెళ్లేవాళ్లు చెబుతున్నారు. అందులో మకాం పెట్టింది ఎందుకోసం, అసలు అందులో రాత్రివేళలో పడుకుంటున్న ఆ ఇద్దరు పురుషులేనా? కాదా? ఇంకెవరైననా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రి కార్యాలయంలో ఉద్యోగులుంటున్నారా, అధికారి ఉంటున్నాడా? ఎవరెవరు ఉంటున్నారు, ఎందుకుంటున్నారు, ఏ పని కోసం ఉంటున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఉంటున్నారు ఇవన్ని కాలనీవాసులతో పాటు బాటసారులను వేదిస్తున్న ప్రశ్నలు.
డిఐఈవోకు పరుపులతో ఏం పని…?
కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి? ఎవరు కొన్నారు? ఎందుకు కొన్నారు? ఎందుకు కార్యాలయానికి తీసుకువచ్చారు? ఎందుకు కార్యాలయంలోనే ఉంచారు? ఆ రెండు పరుపులను వాడుతున్నదెవరు? ఇలా మిలియన్ డాలర్ల ప్రశ్నలు కార్యాలయ సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చిపోయే వారిని సైతం వేదిస్తున్న ప్రశ్నలు. ఒక వేళ డిఐఈవో మద్యాహ్నం విశ్రాంతి కొరకు తెచ్చుకున్నాడుకున్నా ఆయనకు ఒక్క పరుపు చాలు మరి రెండు పరుపులు ఎందుకు తెచ్చినట్లు? అర్ధం కాని పరిస్థితి. మద్యాహ్నం డిఐఈవో విశ్రాంతి తీసుకునే అవకాశమే ఉండదని తెలుస్తున్నది. అలాంటప్పుడు డిఐఈవోకు పరుపులతో ఏం పని? రాత్రివేళల్లో బస చేసేందుకు ఆ పరుపులు కార్యాలయంలో ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కార్యాలయ అధికారులు అధికారికంగా ఆ పరుపులు కార్యాలయంలో ఎందుకు ఉన్నాయో చెబుతే తప్పా ప్రజల అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు దొరకని పరిస్థితి కనబడుతున్నది.
(సీసీ కెమెరాలు ఎందుకు బంద్ చేశారు…త్వరలో)