ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన వసతులు కల్పించామన్నారు. అలాగే డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతవిద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పాఠశాల నుండి అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బందంతోపాటు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ తుమ్మలపల్లి రామ్‌రాజ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.