ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 11
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు పదవులు దక్కుతాయని… జెండా మోసి, పార్టీ కోసం శ్రమించిన వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై ఉప్పల్ ఏ బ్లాక్ పరిధిలో సమీక్షా సమావేశంలో పరమేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఉప్పల్ నియోజకవర్గంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఆరు గ్యారెంటీలు హమీ ఇస్తే, రెండు గ్యారెంటీలు అమలవుతున్నాయని. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, సీఎం రేవంతన్న చొరవతతో ఉప్పల్ నియోజకవర్గం వేగంగా అభివృద్ది చేసుకుందామని పరమేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.