కంచి కామకోటి పీఠాధిపతులకు పూర్ణకుంభ స్వాగతం…

కంచి కామకోటి పీఠాధిపతులకు పూర్ణకుంభ స్వాగతం

యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

 

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల మరియు దేవస్థాన ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన
కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కి ఆలయ అధికారుల దేవస్థాన ప్రధానార్చకులు,

ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనానంతరం కళావేదిక వద్ద స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు.

ఈ కార్యక్రమములలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి ఎం. హనుమంతరావు, ఈవో జె. భవాని శంకర్ ఐ.ఏ.ఎస్ , అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి , ఇతర అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version