పేద కుటుంబాలను ఆదుకోవాలి.

⏩ మౌలిక సదుపాయాలు కల్పించండి.

⏩ మంత్రి కొండా సురేఖ ఆదుకోవాలి.

⏩ 58 59 జీవో ప్రకారం గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి

⏩ గ్రీవెన్స్ సెల్ లో గుడిసె వాసుల విజ్ఞప్తి.

కాశిబుగ్గ నేటిధాత్రి

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల కేంద్రంలో గల జక్కలోద్ది గుడిసె వాసులు సోమవారం సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజలను ఆదుకోవాలని స్థానిక మంత్రి కొండా సురేఖను నిరుపేద ప్రజలు వేడుకుంటున్నారు.వివరాల లోకి వెళ్తే జక్కలోద్ది గుడిసె వాసులందరు వరంగల్ జిల్లా కలెక్టర్ ను గ్రీవెన్స్ లో కలసి మాకు మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగింది.కానీ అక్కడే గ్రీవెన్స్ లో విధులు నిర్వహిస్తున్న ఖిలా వరంగల్ ఎమ్మార్వో గుడిసె వాసులను అవహేళన చేసినట్టు మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. మీరందరూ గుడిసెలను ఖాళీ చేయాలని అంటున్నారు. గుడిసే వాసులందరికీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ అందరికీ పట్టాలి ఇస్తానని మాకు మాట ఇవ్వడం జరిగిందని చెప్పారు. గుడిసె వాసులు ఎమ్మార్వో కు తమ గోడును వెల్లబుచ్చుకున్నా ఎమ్మార్వో మాత్రం ఎవరు చెప్పినా ఏంటమ్మా ,మీకు ఏమైనా పట్టా ఉందా అని గుడిసె వాసులను ఇబ్బంది పెట్టడం జరిగింది. వరంగల్ లో సొంత ఇండ్లు లేక, కిరాయిలు కట్టలేక, నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ పట్టాలు ఇస్తామని మీరందరూ కూడా 58,59 జీవో ప్రకారం అందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఆనాటి ప్రభుత్వం చెప్పిన విధంగా మేము దరఖాస్తు చేసుకున్నామన్నారు.కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రతి ఇంటికి వచ్చి సమాచార సేకరణ కూడా చేయడం జరిగింది.తరువాత ఆనాటి ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది అని అన్నారు.కానీ ఇప్పుడు మాత్రం ఖిలా వరంగల్ ఎమ్మార్వో అందరు కాళీ చేసి వెళ్ళిపోవాలి అనడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి చెప్పిన అధికారులు వినకపోవడం ఏంటని మా బాధలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని బాధపడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే గుడిసె వాసులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మైదం వినోద,ఎత్తూరి శోభా,రాజేష్, దుప్పటి రమ్య, విజయమ్మ, చెందర్,కమలమ్మ మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!