Akula Subhash Mudiraj
ధర్మారావుపేట లో గ్రామ దేవతలకు ఘనంగా పూజలు
ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామములో లొ బుధవారం శ్రావణమాసం ఊర పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలొ భాగంగా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని తల్లిని గ్రామ ప్రజలు కలిసి గ్రామ దేవతలకు చిర సారె పసుపు కుంకుమ పూలు పండ్లు డప్పు చప్పుల్లతో శివసత్తుల ఆటపాటలతో కోడి మేకల తో భక్తులందరూ ఊరేగింపుగా ఊర పోచమ్మ తల్లి బోనాలు ఎత్తుకొని ఊరంత ఉత్సాహంతో ఉత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచి ఉప సర్పంచ్ పోతుల ఆగమ్మ ఆకుల తిరుపతి సింగిల్ విండో డైరెక్టర్ పూజారి రాజేందర్ మత్స్య శాఖ అధ్యక్షులు ఆకుల రాజన్న గౌడ్ సంఘం అధ్యక్షులు నారగాని ఎల్ల స్వామి మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు బాపని రాజయ్య రజక సంఘం అధ్యక్షులు జాలిగాపు రాజయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కడారి బాబు కమిటీ సభ్యులు దూలం శంకర్ కాటకం స్వామి గ్రామస్తులు ఆకుల రవీందర్ నరసింహరావు ఆకుల దామోదర్ పని సాంబయ్య బెనికి రాజేందర్ కేసేటి కుమారస్వామి అక్క పెళ్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు
