
-పొంగులేటి శీనన్నే నా కుడి భుజం
-శీనన్నే నాకు కొండంత బలమని చెప్పిన సిఎం
-మంత్రిత్వ శాఖల నిర్వహణలో శీనన్నే టాప్ అని చెప్పిన సిఎం
-పదేళ్ల బిఆర్ఎస్లో ఆగిపోయిన అభివృద్ధి
-ఖమ్మం అభివృద్ధి పరుగులో పొంగులేటి చిత్తశుద్ధి
-ప్రజలకిచ్చిన మాట కోసం పొంగులేటి కృషి
-తెలంగాణ వచ్చినా నిన్నటి దాక అభివృద్ధికి ఖమ్మం ఆమడ దూరం
-ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం అందుకుంటున్న మొదటి స్థానం
-చికచక సాగునీటి ప్రాజెక్టులు
-ఊరూర ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
-వాడ వాడలా సాగుతున్న అభివృద్ధి పనులు
-అవినీతి రహిత పాలనలో దేశానికే ఆదర్శం
-రెవెన్యూ సంస్కరణల్లో భూ భారతి ఒక విప్లవం
-రిజిస్ట్రేషన్ శాఖలో అనూహ్యమైన మార్పులు
-పేదలకు మెరుగైన సేవలకు రిజిస్ట్రేషన్ శాఖలు నిలయాలు
-ఖమ్మం అభివృద్ధికి మంత్రి పొంగులేటి పట్టుదల
-ఏడాదిన్నరలోనే ఖమ్మం ప్రగతి తోరణాలతో కళకళ
-ఖమ్మంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి శీనన్న కృషి
-ప్రతి ఏడాది 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు
-ప్రతి గ్రామంలో ప్రతి పేదకు ఇల్లు
-ఐదేళ్ళలో విడతల వారిగా నిర్మాణాలు.
-ఖమ్మంలో తొలి విడత ఇండ్లకు గృహప్రవేశాలు
-తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు
హైదరాబాద్,నేటిధాత్రి: ప్రజా ప్రభుత్వం, సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పడుతున్న శ్రమతో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్నదే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఆయన వేసుకన్న ప్రణాళికలను అమలు చేస్తూ వున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. అటు మంత్రిగా రాష్ట్రాభివృద్ది, జిల్లా నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ఖమ్మం జిల్లా అన్ని రంగాలలో ప్రగతిలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ముఖ్యంగా గూడులేని నిరుపేదలు ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామన్న తన ఎన్నికల హమీని పక్కాగా అమలు చేస్తున్నారు. పేదల కళ్లలో ఆనందం నింపుతున్నారు. అన్ని జిల్లాల కంటే ముందుగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టిన నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అంతే వేగంగా తన జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వహస్తాలతో ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయించారు. ఏడాది కాలంలో ఆ ఇండ్లను పూర్తి చేసి మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదగా గృహ ప్రవేశాలు చేయించారు. అదీ నాయకుడిగా, ప్రజలకిచ్చిన హమీలు నేరవేర్చే ప్రజా ప్రతినిధి లక్ష్యమని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన చూసిన తమ జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలని ఇతర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు స్పూర్తిపొందేలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన కితాబు ఎంతో విలువైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనకు కుడిభుజంగా వున్నారని అన్నారు. ఆయన పక్కన వుంటే కొండంత బలమున్నట్లేనే అని మంత్రి పొంగులేటిని సిఎం. కొనియాడారు. ఎందుకంటే మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న మంత్రిత్వ బాధ్యతల్లో ఆయన శాఖలు అన్నింటా ఫస్టు..బెస్ట్ అనిపించేలా పనిచేస్తున్నారు. గత బిఆర్ఎస్ హాయాంలో డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పి ఊరించి, ఊరించి పదేళ్లపాటు ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు. ఒక్క ఇటుక పేర్చలేదు. అలాంటి కాలం నుంచి కాంగ్రెస్‌ను అదికారంలోకి తెచ్చి, ఖమ్మం జిల్లాలో అర్హులైన పేదలందిరకీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తున్నారు. గృహ నిర్మాణ మంత్రిగా కూడా పొంగులేటి శ్రీనివాస్ వుండడంతో ఇందిరమ్మ ఇండ్లపై ఎక్కువ దృష్టిపెట్టారు. ఈ ఐదేళ్ల కాలానికి 20లక్షలకు పైగా ఇ ందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం శరవేగంగా జరుతున్నాయి. అందులో చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కూడా జరుపుకున్నాయి. ఈ దసరాకు చాలా వరకు పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్దంగా వున్నాయి. గత ప్రభుత్వంలాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంమాటలు చెప్పి తప్పించుకోలేదు. అందుకే తొలి ఏడాది బడ్జెట్లో రూ.22వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఏడాది మొత్తం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపూరి చేయనున్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే పేదలకు ఇంటి నిర్మాణ పూర్తిని బట్టి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే అటు ఇంటి నిర్మాణం,ఇటు బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరగకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతి వారం డబ్బులు వేయడం అనేది గొప్ప విషయం. ఏ వారానికి ఆ వారం డబ్బులు చేతిలో వుంటే, ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పులు చేయాల్సిన అవసరం వుండదు. పైగా ఇంటి నిర్మాణం ఒక్క రోజు కూడా ఆగిపోదు. వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్గుతుంది. ఇలా గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేయలేదు. గత బిఆర్ఎస్ పాలకులు అసలే చేయలేదు. డబుల్ బెడ్రూంలు నిర్మాణం చేసి ఇస్తామని 2014,2018 ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. కాని ఇండ్లు నిర్మాణం చేపట్టలేదు. తర్వాత అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. ఆ మాటను కేసిఆర్ తప్పారు. ఏ రకంగా ఇండ్లను ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తీరా గత ఎన్నికల సమయంలో సొంత స్థలం వున్నవారికి రూ.5లక్షలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. దానిని ప్రజలు నమ్మలేదు. పదేళ్లలో పది ఇండ్లు కట్టని బిఆర్ఎస్కు ఎన్నికలప్పుడే డబుల్ బెడ్రూంలు గుర్తొస్తాయని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిందంటే ఖచ్చితంగా ఇండ్లు ఇస్తుందని బలంగా నమ్మారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేదలందిరకీ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. ఆ సమయంలో తెలంగాణలో 25లక్షల ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో రేవంత్ సర్కారు ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటి విడతలో ఇండ్లు రాని వారు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇంకా నాలుగేళ్ల కాలం వుంది. విడతలవారిగా ఇచ్చే ఇండ్లలో ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు హమీ ఇచ్చారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లతోపాటు, ఆయన నిర్వహిస్తున్న రెవిన్యూ శాఖలో కూడ అనేకు మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. ప్రజాపాలన ప్రజలకు మరింత చేరువ చేశారు. గత ప్రభుత్వ హాయాంలో తీసుకొచ్చిన ధరణి మూలంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నీ తీర్చేందుకు భూ బారతీ తెచ్చారు. ప్రజల సమస్యలు తొలగించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమల రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు పడకుండా చేశారు. ధరణి మూలంగా కొన్నిలక్షల మంది సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఎంత చెప్పినా కేసిఆర్ వినిపించుకోలేదు. ప్రజల బాధలు పట్టించుకోలేదు. దాంతో రెవిన్యూ వ్యవస్ధలో అప్పుడు పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నాయకులు పంచుకొని తినడానికి ధరణి బిఆర్ఎస్కు ఉపయోపడిరది. కాని ఇప్పుడు భూ భారతి మూలంగా ఏ ఒక్కరికీ ఇబ్బంది రాదు. నష్టం కలగదు. అవినీతికి ఎక్కడా తావులేదు. ఏ ఒక్క అదికారి అవినీతికి పాల్పడిని ప్రజా ప్రభుత్వం ఉపేక్షించడం లేదు. ఎంతో మంది అవినీతి అదికారులను జైలుకు పంపించారు. అవినీతిని ఇంతగా అంతం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. దేశంలోనే ఇంతలా అవినీతిని కంట్రోల్ చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. అంతగా అవినీతి నిర్మూలన జరుగుతోంది. అది కేవలం రెవిన్యూలోనే కాదు, అన్ని శాఖల్లో అమలు జరుగుతోంది. అవినీతి రక్కసి పారిపోతోంది. ఇక రిజిస్ట్రేషన్ శాఖలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఒకే దగ్గర అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేశారు. దాంతో ప్రజలకు ఎలాంటి అసౌక్యం కలగకుండా పోయింది. అవినీతి అనే పేరు వినపడకుండా చేసిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికే దక్కింది. ఇలా తన శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తూనే మరో వైపు ఖమ్మం జిల్లా ప్రగతిని బాటలువేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగు విస్తరణ, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిపిస్తున్నారు. ఖమ్మ జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. మంత్రి పొంగులేటి చొరవతో తెలంగాణలో పదేళ్ల తర్వాత సుమారు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. పేదలకు సన్న బియ్యం అందేలా చేస్తున్నామని పొంగేలేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇలా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ చేస్తూ ముందుకు సాగుతుండడంతో, మంత్రుల్లో ఆయననే ఫస్ట్ , బెస్ట్ అనే కితాబు అందుకుంటున్నారు. మిగతా మంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకొని అభివృద్ది పనులు వేగ వంతంచేస్తున్నారు. దటీజ్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని కొనియాడబడుతున్నారు.