మాజీ సింగల్విండో డైరెక్టర్ నాగినేని జగదీశ్వర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
స్థానిక సంస్థలనుంచి చట్టసభల వరకు రాజకీయ రిజర్వేషనున్లు కల్పించాలని మంథని నియోజకవర్గం లోని ముత్తారం మాజీ సింగల్విండో డైరెక్టర్ నాగినేని జగదీశ్వర్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం ముత్తారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికాలంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించినప్పుడే వారి పక్షాన ప్రశ్నించే గొంతుకు నాంది పలికే అవకాశం ఉంటుందన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాల్లో 5శాతం వికలాంగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 2024 లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు 15శాతం దివ్యాంగ కుటుంబాలు ఉండగా అందులో 10కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. కావున వికలాంగులకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్ తదితరులు పాల్గొన్నారు.