ఆర్డిఓ కె.శ్రీనివాస్ పిలుపు
పరకాల నేటిధాత్రి
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం లోని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఓటింగ్ శాతం పెంచుటకు కృషి చేయాలని పరకాల రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్డీవో కే శ్రీనివాస్ రాజకీయ పార్టీల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పరకాల అసెంబ్లీ నియోజకవర్గం లో ఓటింగ్ కోసం నూతన ఓటర్ నమోదు కార్యక్రమం ఓటరు ప్రక్రియను కొనసాగుతుందని ఓటు హక్కు నమోదు చేసుకుని వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క యువతీ యువకులు వినియోగించుకొనుటకు నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి పరకాల అసెంబ్లీ అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్,బిఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను,సిపిఎం కార్యదర్శి బొచ్చు కళ్యాణ్, కాంగ్రెస్ పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు దుబాసి వెంకటస్వామి,పరకాల తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి,నడికూడ తహసీల్దార్ నాగరాజు,ఆత్మకూర్ తహసీల్దార్ మారుపాక సురేష్, సంగెం తహసిల్దార్ రాజకుమార్,నడి కూడా డిప్యూటీ తాసిల్దార్ సూర్యనారాయణ,పరకాల ఆర్డిఓ కార్యాలయం డిటి విజయశ్రీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.