https://epaper.netidhatri.com/view/257/netidhathri-e-paper-8th-may-2024%09/4
`పొలిటికల్ మాస్ మహారాజా!
`హరీష్ వుంటే వార్ వన్ సైడే!
`హరీష్ డిసైడైతే గెలుపు వరించాల్సిందే.
`మెదక్ బీఆర్‌ఎస్ గెలిచినట్లే.
`అభ్యర్థి ఎవరైనా హరీష్‌ను చూసి ఓటు పడాల్సిందే
`అలుపెరుగని యోధుడు!
`నిరంతర ప్రజాశ్రేయస్కుడు.
`పద్నాలుగేళ్ల ఉద్యమం.
`అలుపెరగని పోరాటం.
`పేద ప్రజల కోసం ఆరాటం.
`అవలీలగా ఎన్నికల సమరం.
`ఎన్నికలేవైనా ఒంటి చేత్తో ప్రచారం.
`మెదక్ పార్లమెంటు పోరులో బిఆర్‌ఎస్ దే విజయం!
హైదరాబాద్,నేటిధాత్రి:
నాయకుడంటే ఒక విజన్ వుండాలి. నాయకుడంటే విజనరీగా వుండాలి. నాయకుడంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుండాలి. నాయకుడంటే విజయాలను అందించాలి. నాయకుడంటే సంక్షేమం చూపాలి. ప్రజలకు ప్రేమ చూపాలి. ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని వుండాలి. అధికారంలో వున్నా, లేకున్నా ప్రజల నిత్యం స్మరిస్తూ వుండాలి. నాయకుడి కోసం తపించేలా వుండాలి. ఆ నాయకుడికి ప్రజలంటే పరితపన వుండాలి. వారి కోసం అహర్నిషలు పనిచేసేలా వుండాలి. తనను నమ్ముకున్న వారిని అండగా వుండాలి. అలాంటి అన్ని సుగుణాలున్న , మనసున్న నాయకుడు హరీష్‌రావు. కంటెంటున్న వాడికి కటౌట్ చాలు అన్న పదం అటు నవతరం రాజకీయాల్లో కేసిఆర్‌కు, యువతరం రాజకీయాల్లో హరీష్‌రావుకు మాత్రమే సూటౌతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే హరీష్‌రావు అంటేనే ఒక ఉద్యమం. ఆయన ప్రజల కోసం ఆరాటమైనా, ప్రజల కోసం సంక్షేమైనా ఒక ఉద్యమంలా చేస్తాడు. ప్రజల ప్రేమను కూడా ఒక ఉద్యమం దోచుకుంటాడు. హరీష్ అంటే ఒక పోరాటం. నాడు తెలంగాణ కోసం పోరాటం చేశాడు. సమస్యల మీద సమర శంఖారావం పూరించాడు. అధికారంలో వున్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడ్డాడు. మొత్తం తెలంగాణ కోసం అహర్నిషలు కృషిచేశాడు. ఆయన పని రాక్షసుడు. అందుకే ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని వున్నారు. పదవిలో వున్నా, లేకున్నా ఆయన ముందు నాయకులంతా దిగదుడుపే. సింహం ఎక్కడున్నా సింహమే..ఏనుగుకు ఎక్కడైనా కొండంత విలువే అన్నట్లు హరీష్‌రావంటే ఏ ప్రాంత ప్రజలకైనా ప్రేమే. అందుకే ఆయన సమస్యల సాధకుడు. ప్రగతి స్వాప్నికుడు. కార్యసిద్ది గల శ్రామికుడు. ఆయనకు అప్పగించిన ప్రతి పనిలో గెలుపును సొంతం చేసుకునే విజయుడు. రాజకీయాలలో అజేయుడు. ఎన్నికల విజేత. ప్రచారాలలో ఎదురులేని నేత. అందుకే ఆయను ట్రబుల్ షూటర్ అంటారు. ప్రత్యర్ధుల మీద హరీష్‌రావు ఎక్కుపెట్టే గాండీవాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అంతటి సమర్ధుడు హరీష్‌రావు. అందుకే ఎవరు ఔనన్నా,ఎవరు కాదన్నా బిఆర్‌ఎస్‌లో మలితరం, యువతరం నాయకుల్లో హరీషే నెంబర్ వన్…పార్టీలో ఆయనే సూపర్ మ్యాన్.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ స్టార్ కాంపైనర్‌గా హరీష్‌రావు పోషిస్తున్న పాత్ర అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
గత ఎన్నికలు వేరు.గతంలో ఆయన చూపిన చొరవ వేరు. పార్టీ అధికారంలో వున్నప్పుడు వుండే పాత్రకు, ప్రతిపక్షంలో వున్నప్పుడు నిర్వర్తించే పాత్రకు చాలా తేడా వుంటుంది. పార్టీ అధికార పక్షంలో వున్నప్పుడు పార్టీ శ్రేణులు కూడా ఎంతో సహకరిస్తాయి. అప్పుడు నాయకుల వెంట శ్రేణులు ఎప్పుడూ వుంటారు. అధికారంలో లేనప్పుడు శ్రేణులను ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ వుండడం, వారిని ఎన్నికలకు సన్నద్దం చేయడం వంటి కార్యక్రమాలు అంత సులువైనవి కాదు. అధికారంలో వున్నప్పుడు నాయకుల కోసం శ్రేణులు ఎదురుచూస్తుండడం పరిపాటి. కాని అధికారంలో లేనప్పుపడు శ్రేణుల కోసం ఎంత సమయమైనా వేచిచూడాల్సిన సందర్భాలు కూడా నాయకులకు ఎదురుకావొచ్చు. అయితే హరీష్‌రావు నాయకత్వంలో వుండే విశిష్టమైన లక్షణం చాలా అరుదుగా వుంటుంది. ఆయన అధికారంలో వున్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా ఒకేలాగా వుండడం మాత్రమే తెలుసు. అందుకే ఆయన అందరికీ నచ్చుతాడు. అంతే కాదు పార్టీలో ఏ నాయకుడైనా, ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా చెప్పగిలేంత చనువు ఒక్క హరీష్‌రావు వద్దమాత్రమే వుంటుంది. ఎవరు ఏది చెప్పినా వింటాడు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఎంత సేపైనా వారి సమయం కేటాయిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమింటే ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి తన వద్దకు రావొద్దని సూచిస్తాడు. నేనే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పండి. ఏదైనా అత్యవసరం అయితే తప్ప తన వద్దకు రండి అని చెప్పగలిగేంత గొప్ప గుణం ఆయనది. ఎందుకంటే చాలా మంది నాయకులు ఎన్నికల సమయంలో తప్ప, ఇతర సమయాల్లో ప్రజలకు అందుబాటులో వుండరు. నాయకుల దగ్గరకు ప్రజలు ఒకటికి పదిసార్లు తిరిగే సందర్భాలు కూడా వుంటుంటాయి. కాని హరీష్‌రావు వద్దకు ఎవరొచ్చినా, అదే రోజు ఆ వ్యక్తి పని పూర్తికావాలి. మళ్లీ మళ్లీ ప్రజలు తన వద్దకు రప్పించుకోవడం అన్నది ఏనాడు జరగదు. అందుకే ప్రజలు ఆయనను అంతగా అభిమానిస్తారు. సిద్దిపేట మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు తప్పితే, తర్వాత కాలంలో ఏనాడు హరీష్‌రావు వాడవాడలా తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఇప్పటికీ రాలేదు. కారణం ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే వుంటారు. ఎన్నికల సమయంలో మీరు ప్రత్యేకించి రావొద్దని ప్రజలే హరీష్‌రావు ప్రేమతో చెబుతుంటారు. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న నాయకులు చాలా అరుదు. అందులో హరీష్‌రావు అగ్రగణ్యుడు.
ఎన్నికలు ఏవైనా, ఎక్కడైనా, ఎంత కష్టతరమైనా సరే పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో హరీష్‌రావు పాత్ర అమోఘం. అనన్య సామాన్యం.
ఎందుకంటే ఎన్నికల పోరు ఆయనకు తెలంగాణ బాటలో అలవాటైన మార్గం. ఉద్యమ కాలంలో హరీష్‌రావు పాత్ర లేని ఎన్నిక లేదు. అది స్ధానిక సంస్ధల ఎన్నికలైనా, శాసన సభ ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా…ఏ ఎన్నికలైనా హరీష్ ముందుండాల్సిందే…గెలిపించేందుకు హరీష్ తోడు వుండాల్సిందే..అందుకే ఉద్యమ కాలంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా హరీష్‌రావు అక్కడ ప్రచారం చేయాల్సిందే..అన్నంతగా జనాన్ని ఆకర్షించగలిగారు. జనం మొప్పును పొందగలిగారు. ఆయన సాదించిన ఎన్నికల విజయాలు నభూతో నభిష్యతి. తన ఎన్నికలే కాదు, తన తోటి వారందరి ఎన్నికలను గట్టెక్కిస్కాడు. హరీష్ ఎన్నికల ప్రచారం చేశాడంటే అక్కడ విజయమే..అంతెందుకు బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఎన్నికల ప్రచారం కూడా ఎప్పుడూ భుజాలపై మోసే నాయకుడు హరీష్‌రావే. ప్రతి ఎన్నికల్లోనూ సిద్దిపేటతోపాటు, గజ్వెల్ ఎన్నికల బాధ్యత కూడా హరీష్‌రావే తీసుకుంటాడు. కేసిఆర్ అప్పగించిన ఇతర నియోజవర్గాలలో ప్రచారం సాగిస్తుంటాడు. ఇలా బిఆర్‌ఎస్‌ను కంటిపాపలా కాపాడుకునే నాయకుడు హరీష్‌రావు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ మెదక్ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తున్నాడు. ఒక రకంగా ఆయన పోటీ చేస్తున్నంత సీరియస్‌గానే ప్రచారంలో విసృతంగా పాలు పంచుకుంటున్నాడు. అటు మెదక్ ప్రచారంతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటూ అహర్నిషలు కృషి చేస్తున్నాడు. గత శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు స్ధానాలు తప్ప, మిగతా అన్ని స్ధానాలను గెలిపించిన ఘనత హరీష్‌రావుదే. తెలంగాణలో ఉప ఎన్నికలు అంటే చాలు హరీష్ పరిగెత్తాల్సిందే?: ఇప్పుడున్నంత నిమ్మలం ఒకనాడు లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్విరామంగా దశాబ్ధంన్నర కాలం. కడుపు నిండా తిన్నది లేదు. కంటినిండా నిదురపోయిన సమయం లేదు. ప్రయాణాలలో పెద్ద పైళ్లు ముందు పెట్టుకొని, సంతాకాలు చేసిన రోజులున్నాయి. తన కారే కార్యాలయంగా మల్చుకొని హరీష్‌రావు పనులు పూర్తి చేసిన రోజులున్నాయి. ఇలాంటి అనుభవం ఎవరికీ ఎదరు కాలేదు కావొచ్చు. ఎందుకంటే నాడు హరీష్‌రావుదే తెరాసబాధ్యత.
ఉప ఎన్నికల వచ్చిన ప్రతీసారి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు.
ప్రజలకు ఏం కావాలో హరీష్‌రావుకు తెలుసు. ప్రజల ఏ కోరుకుంటున్నారో తెలుసు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఏలాంటి అవసరాలు వున్నాయో తెలుసు. ఏఏ ఊరిలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసు. ఏ వ్యక్తి ఏ గ్రామానికి చెందిన వ్యక్తో కూడా తెలుసు. ఒక్కసారి ఒక వ్యక్తిని చూస్తే మర్చిపోవడం అంటూ వుండదు. ఒక్కసారి పేరు వింటే ఎంత కాలానికైనా గుర్తుపట్టి పిలవడం తెలుసు. అంత జ్ఞాపకశక్తి కల్గిన నేత హరీష్‌రావు. అభివృద్ది అంటే ఏమిటో, ప్రజలు కోరుకునేదేమిటో తెలిసిన నాయకుడు హరీష్‌రావు. అందుకే సిద్ధిపేట అంటే హరీష్‌రావు అన్నంత సార్ధకత సంపాదించుకున్నారు. ముప్పై ఏళ్ల క్రితం సిద్దిపేటకు ఇప్పటి సిద్ధిపేటకు ఎంతో తేడా వుంది. 1985 లో తొలిసారి సిద్దిపేట నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసిఆర్ సిద్దిపేట అభివృద్ధికి పునాదులు వేశారు. 2005లో ఎమ్మెల్యే అయినా హరీష్‌రావు ఆ పునాదుల మీద గొప్ప నగరాన్ని నిర్మాణం చేశారు. సిద్దిపేటను నభూతో నభిష్యత్ అని చెప్పుకునేలా విస్తరింపజేశారు. నగరంగా ఉన్న సిద్దిపేటను మహానగరంగా తీర్చిదిద్దారు. ఇక నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అందమైన ప్రకృతి వనం చేశారు. సకల సౌకర్యాలు కల్పించారు. మా ఊరికి ఇది లేదు అన్నంతగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేశారు. పల్లెసీమలు వికసింపజేసేలా ప్రగతిని కనబర్చారు. అందరూ అబ్బుర పడేలా చేశారు. ఇది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ముపై ఏళ్ల క్రితం నగర పంచాయితీ స్ధానం నుంచి కేసిఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా వున్న సమయంలో మున్సిపాలిటీ స్ధాయికి పెంచారు. తెలంగాణ సాధించుకున్నాక హరీష్‌రావు మున్సిపల్ కార్పోరేషన్ చేశాడు. నగరంగా వున్న సిద్ధిపేటను మహానగరంగా మార్చి, గొప్ప నగరంగా తీర్చిదిద్దాడు. ఒకనాడు సిద్ధిపేటలో నీటి కటకట విపరీతంగా వుండేది. సిద్ధిపేట పట్టణంలోనే కాదు, నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో నీటి కటకట వుండేది. కేసిఆర్ ఎమ్మెల్యేగా వున్నప్పుడు కొంత నీటి గోస తీర్చాడు. ఇంటింటికీ మంచినీళ్లు అందించారు. దాని కొనసాగింపుగా హరీష్‌రావు సిద్ధిపేటలో జలసిరులు నాట్యమాడేలా చేశాడు. ఈ రెండూ ఏ కాలంలో నిర్వర్తించి, ప్రజల మన్ననలు పొందిన నాయకుడు హరీష్‌రావు.