నర్సంపేట, నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ పక్కన గల మరదల షెడ్డులో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై వివరాలు వెల్లడిస్తూ అయ్యప్ప టెంపుల్ పక్కన గల పరదల షెడ్డులో గొడిశాల కాంతయ్య, ఆంగోతు వెంకన్న, బాతుల కుమార్,దండు వేణు అనే నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. ఒక్క సమాచారం మేరకు దాడిచేసి రూపాయలు 3560 నగదు, 4 సెల్ ఫోన్లు పేక ముక్కలను స్వాధీనం చేసుకొని పేకాట రాయుళ్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.