హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మండల పరిధిలోని పలు గ్రామాలలో పోలీస్ కవాతు ను నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జయగిరి, అనంతసాగర్, మడిపల్లి, దేవన్నపేట ప్రధాన రహదారుల్లో సిఆర్పిఎఫ్ బెటాలియన్ కేంద్ర బలగాలతో పాటు హసన్ పర్తి పోలీసులు కూడా ఈ కవాతు లో పాల్గొన్నారు. ఓటర్లకు పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నామని ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణం లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలందరికీ రక్షణగా తామున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అసాంఘిక, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలైన తమ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలా పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని హసన్ పర్తి సి ఐ జె సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ అశోక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.