
నర్సంపేట,నేటిధాత్రి :
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం పోలీస్ అబ్జర్వర్ రాజేష్ కుమార్ నర్సంపేట ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాన్ని , అలాగే మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూం ఏర్పాటు బాగున్నాయని అన్నారు.
అలాగే ఆరో కార్యాలయం తనిఖీలో భాగంగా నర్సంపేట రిటర్నింగ్ అధికారికి కృష్ణ వేణి పోలీస్ అబ్జర్వర్ రాజేష్ కుమార్ కు స్వాగతం పలికారు.
స్ట్రాంగ్ రూం నిర్వహణ పట్ల రిటర్నింగ్ అధికారినికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు.వారి వెంట ఎసిపి తిరుమల్, నర్సంపేట ఏఆర్వో విశ్వ ప్రసాద్,సిఐలు కిషన్ రవీందర్,సంబంధిత అధికారులు వారి వెంట ఉన్నారు.