పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,లో బుధవారం
రోజున చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి సమక్షంలో ఏఎస్ఐ మధుసూదన్ సారధ్యంలో పాఠశాలలోని విద్యార్థులు అందరి చేత మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానవ మనుగడకు పెనుముప్పు అని మాట్లాడడం జరిగింది. మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందిన దేశంఅని, మాదకద్రవ్యాలను అందరం కలిసికట్టుగా నిర్మూలించుదామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బొమ్మ రాజమౌళి, రామ్ నారాయణ, శ్రీనివాస్, ఉస్మాన్ అలీ, శంకర్, బుర్ర సదయ్య, సరళ దేవి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, మౌనిక, స్వామి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పూర్వ విద్యార్థి గుర్రపుచందర్ తదితరులు పాల్గొన్నారు.