
25 కేజీల బియ్యం రూ.5 వేల ఆర్థిక సహాయం.
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు గుర్రపు గట్టయ్య వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతూ పడిపోగా వెన్నుపూస నడుము విరిగి రెండు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన ఇటీవల అప్పన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న పత్రికలో వచ్చిన ప్రకటనకు స్పందించి రెండు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన గట్టయ్య కుటుంబం దీనస్థితిని చూసి చలించిపోయిన చిట్యాల పోలీసులు కుటుంబానికి 25 కిలోల బియ్యం బస్తా, రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని నిరూపించుకుని..ప్రజల చేత శభాష్ పోలీస్ అన్నలు అనిపించుకుంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సహచర ఉద్యోగులు వీరిని అభినందిస్తున్నారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో పోలీసులు సిద్ధార్థ, లాల్ సింగ్, వెంకటేష్, సుమన్, రాజేందర్, అనిల్ తదితరులున్నారు.