Police Seize 69 Vehicles in Community Drive
రామారావుపేటలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్
69 వాహనాలు సీజ్ – సిఐ నవీన్
జైపూర్,నేటి ధాత్రి:
రామగుండం కమిషనరేట్ పరిధిలోని జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ సీఐ నవీన్,ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు గ్రామ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి,ఆస్తి సంబంధిత నేరాలు,రోడ్డు ప్రమాదాలు,సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్ లావాదేవీలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం గ్రామంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 66 ద్విచక్ర వాహనాలు,3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.వాహనదారులు తప్పనిసరిగా చట్టబద్ధమైన పత్రాలు కలిగి ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
