పేకాట రాయుళ్లపై పోలీసుల పంజా….11 మంది అరెస్టు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
పేకాట రాయుళ్ల స్థావరంపై రామకృష్ణాపూర్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 11 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ముత్యాల ప్రదీప్ ఇంట్లో రహస్యంగా అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుండి 38.290 రూపాయల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముత్యాల ప్రదీప్, మిర్యాల శ్రీనివాస్, దయాకర్, మోతే శ్రీనివాస్, ఎస్.కె చాంద్ పాషా, వెంకటేష్, గూడ సత్తయ్య, పులి శ్రీనివాస్, బండి కిషోర్, సత్యం, రామ్ మహేందర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.