నంది వాహనంపై ఆదిదంపతులు
• వైభవంగా స్వామివారి ఊరేగింపు
• దర్శనానికి 2 గంటల సమయం
• రెండు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా
• ప్రశాంతంగా కొనసాగుతున్న ఉత్సవాలు
• నేడు కేతకీ స్వామివారి కల్యాణోత్సవం
:-అష్ట తీర్థాల నిలయం, దక్షిణ కాశీగా
జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవా లయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి లిం గో దృవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభి షేకం, మహా రుద్రాభిషేకం, భస్మార్చన, మహా మంగ ళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. గురువారం ఉదయం అమ్మవారికి విశేష కుంకుమార్చన, యాగశాలలో రుద్ర స్వాకార హోమం, శాంతి హోమం అర్చకుల వేద మంత్రాలు, భక్తుల హర హర మహాదేవ శంకర అనే ప్రతిధ్వనుల మధ్య హోమ పూర్ణాహుతి జరిగింది. సాయంత్రం 5:30 లకు ఆది దంపతులైన పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారు నంది వాహనం పై అభయమిస్తూ భక్తులకు దర్శనమి చ్చారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు అనంతరం స్వామివారి నంది వాహన సేవ ను ప్రారంభించారు.
కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల, పు రంతులు వేసిన దండకాల మధ్య స్వామివారి ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఝరాసంగం మాడవీధుల్లో ఊరేగిన స్వామి వారి భక్తులకు అభయమిస్తూ దర్శన మిచ్చారు. ఆది దంపతుల నంది వాహన సేవ నయనా
నందభరితంగా సాగింది. 11 వరకు గంటలకు నంది వాహన సేవ మంగళహారతితో ముగిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ ధర్మా దాయశాఖ (సిఎఫ్ఎ) ఉత్సవ నిర్వహణ ప్రత్యేక అధికారి సులోచన, జిల్లా అధికారులు రంగారావు, సారా శ్రీనివాస్, ఈవో శివ రుద్రప్ప, ఝురా సంగం ఎస్సై సరేష్ పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.”
కేతకీ లో పీఠాధిపతి, కర్ణాటక ఎస్పీ పూజలు
కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఉదయం బర్దిపూర్ క్షేత్ర పీఠాధిపతి 1008 మహామం డలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి, కర్ణాటక, కలబురిగి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు