రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో ఎస్ఐ మామిడాల సురేందర్ తమ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఉదయం 11 గంటలకు వరంగల్ నుండి మహారాష్ట్ర వైపు పిడిఎస్ బియ్యాన్ని MH26BE1455 నెంబర్ గల లారీలో కందుకూరి మహేష్ బాబు అను వ్యక్తి తరలిస్తుండగా అలీమ్ ఖాన్, బషీర్ ఖాన్ డ్రైవర్ లు, గుమాస్తా ల్యాడ నరేష్ తో పాటు లారీని పట్టుకొని పంచనామ నిర్వహించి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మామిడాల సురేందర్ తెలిపారు.