Police Arrest 11 in Gambling Case at Nyalkal
అధిక మొత్తంలో జూదమాడుతున్న 11మంది జూదరులపై కేసు నమోదు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల
నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని రాజోల గ్రామంలో జర్నప్ప వ్యవసాయ క్షేత్రంలో చెరుకు తోటలో జూదం ఆడుతున్న 11 మంది జూదరులను నేడు అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సుజిత్ తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వ్యక్తులు జూదం ఆడుతుండగా వారి వద్ద నుండి రూ:1,80,000 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
