యువజన క్రీడల జిల్లా అధికారి రఘు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు తెలంగాణ క్రీడాపాలసీ ద్వారా సహకారం అందించేందుకు సమాచారం సేకరిస్తున్నట్లు యువజన క్రీడల అధికారి శ్రీ చిర్ర రఘు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు క్రీడాపోటీల్లో ప్రతిభ కన బరిచిన క్రీడాకారులు తమ వివరాలను పొందుపరిచి, క్రీడల సర్టిఫికెట్కు 2 పాస్ ఫొటోలను జతచేసి ఈనెల 23లోగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయం రూం నో. F-25/A, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము లో అందజేయాలని కోరారు.