
నేటిధాత్రి -గార్ల :- రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆశయంతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం నిరుపయోగంగా మారి డంపింగ్ యార్డులా దర్శనమిస్తుంది.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చిన్నకిష్ణాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన క్రీడామైదానం అంగన్వాడి,ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీలకు అతి సమీపంలో ఏర్పాటు చేశారు. అయితే క్రీడా మైదానం పక్కనే డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో సేకరించే చెత్తను డంపింగ్ యార్డులో వేయవలసిన గ్రామపంచాయతీ అధికారులు డంపింగ్ యార్డ్ లో కాకుండా క్రీడా మైదానంలో పడేయడంతో ఇక్కడి చెత్తను కాల్చడంతో ఎగిసిపడుతున్న మంటలు,పోగలతో ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ లోని పిల్లలు,స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య గురించి అనేక దఫాలుగా అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే క్రీడా మైదానంలో నుండి చెత్తను తీసివేసి డంపింగ్ యార్డ్ లో వేయాలని ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నారు.