విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి గారికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు నివాసి విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా చిత్రపటానికి నివాళులర్పించి వారి కుమారులైన
ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధుకర్ రెడ్డి, అభ్యాస్ హైస్కూల్ కరస్పాండెంట్ నరేష్ రెడ్డి గార్లను పరామర్శించారు.
చాలాకాలం ఉపాధ్యాయులుగా ఎంతో నిబద్దతతో పనిచేసి చాలామంది విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో జనార్దన్ రెడ్డి గారు కృషి గొప్పది అని ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేశార
ఈ కార్యక్రమంల తొర్రూరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు మండల మాజీ జెడ్పిటిసి & జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఎనిమినేని శ్రీనివాసరావు, ధరావత్ జై సింగ్, రాయిశెట్టి వెంకన్న,
బోలగాని వెంకన్న పాల్గొన్నారు.