నేటి ధాత్రి కమలా పూర్ (హన్మకొండ)
రోడ్ ప్రమాదంలో మృతి చెందిన కమలాపూర్ కు చెందిన ఫోటోగ్రాఫర్ పత్తిపాక శ్రీధర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 1లక్షా 70 వెయిల రూపాయల చెక్కును మృతుని కుటుంబానికి సోమవారం అందచేసారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్అసోషియేషన్ క్యాషియర్ సత్యం, కమలాపూర్ మండల అద్యక్షులు విడపు ప్రతాప్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు దయాకర్, కనుకుంట్ల సతీష్, సిందె ఆనందరావు, దాసరి రమేష్, కొలిపాక రాజేందర్, నర్సింగారావు, కర్ణాకర్ మరియు జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ నాయకులు పాల్గొన్నారు.