
బీజేపీ నాయకులు రాస బిక్షపతి యాదవ్
మొగుళ్ళపల్లి ఏప్రిల్ 11 మొగుళ్ళపల్లి నేటి ధాత్రి గత రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై కాంగ్రెస్ ఎంత విష ప్రచారం చేసిన ప్రజలు సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వానికి మద్దతు పలుకుతూ మూడవసారి బిజెపికి ప్రజలు అధికారం కట్టబెట్టారని బిజెపి నాయకులు రాస బిక్షపతి యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బిజెపి పార్టీపై అధికారంలోకి రాకుండా విశ్వ ప్రయత్నం చేసిన ప్రజలు బిజెపికి అధికారం కట్టబెట్టారని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయంగా భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు కల్పించిన మోడీపై విష ప్రచారం చేస్తూ కేంద్రంలో బిజెపి పార్టీ మూడోసారి అధికారంలోకి రాకుండా ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు ఉన్నన్ని రోజులు బిజెపి పార్టీని ఏమి చేయా లేరని అన్నారు. ఎన్నికలలో ఒంటరిగా బిజెపి పార్టీ 240 సీట్లు తెచ్చుకుందని ఎన్నో పార్టీలతో కూటమిగా అవతరించిన ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయని మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ మరెన్నో అద్భుత విజయాలు సాధిస్తారని త్వరలోనే భారతదేశం అగ్ర దేశంగా అవతరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోరాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తప్పక వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.