భానుడి…… భగభగ.
#సుర్రు మనిపిస్తున్న సూరీడు.
#ఎండలకు భయపడి బయటకు రాని ప్రజలు.
#నిర్మానుషమైన ప్రధాన రహదారులు.
#41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
#వేసవిలో జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన.

నల్లబెల్లి, నేటి ధాత్రి:
సూరీడు సుర్రుమంటున్నాడు ఉక్క పోత చికాకు పుట్టిస్తుంది వడగాల్పులు వెంటాడుతున్నాయి. వేసవిలో ఎండలు దంచి కొట్టడంతో రహదారులన్నీ నిప్పుల కుంపటిగా మారిపోయి నిర్మానుషంగా కనిపిస్తున్నాయి కొద్ది రోజులుగా సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం 8 గంటల నుండి ఇంటి నుండి బయటకు రావడానికి జనం జంకుతున్నారు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధి కూలీలు, కార్మికులు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకొని నిర్దిష్ట సమయానికే పని ముగించుకుని ఇండ్లలోకి చేరుకుంటున్నారు ఏప్రిల్ మాసంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయమని పలువురు వాపోతున్నారు గత వారం రోజులుగా మండలంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనర్వం ఈ అధిక వేడిని తట్టుకోలేక మనుషులతో పాటు పశుపక్షాలు సైతం తల్లాడిల్లుతున్నాయి చెరువులలో, కుంటలలో తగినంత నీరు నిల్వ లేకపోవడంతో మూగజీవాల సైతం మృత్యువాత పడుతున్నాయి మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్త వహించిన అనారోగ్యం బారిన పడతారని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ప్రజలు బయటకు రావడం లేదు మధ్యాహ్నం12 నుండి సాయంత్రం4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారిపోయాయి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల మండల ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు అందులో భాగంగా ఎయిర్ కండిషన్, కూలర్ల లాంటి వాటిని ఇంటి లోపల సమకూర్చుకుంటున్నారు ఉపాధి హామీ కూలీ పథకానికి వెళ్లే కూలీలు ఉదయం తెల్లవారుజామునే పనికి వెళ్లి 11 గంటల సమయంలోపే పని ముగించుకుని ఇండ్లకు చేరుకొని నిమ్మరసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను సేవించి సేద తీరుతున్నారు రైతులు అరకొర వ్యవసాయ పనులు ఉండడం వల్ల ఉదయాన్నే పనులను ముగించుకుంటున్నారు వాహనాదారులు రాకపోకల సమయంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పండ్ల రసాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ , కొబ్బరి బోండాలు, వాటర్ మిలన్,మజ్జిగ లాంటి వాటిని సేవించి ఎండ ఎద్దడినుండి ఉపశమనం పొందుతున్నారు.
#వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలి…
#డాక్టర్ ఆచార్య వైద్యాధికారి . నల్లబెల్లి.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు ఎండలో తిరిగే వారికి వేడి గాలులు వీచే సమయంలో డిహైడ్రేషన్ తో పాటు, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ బారిన పడినవారు ఆకలిని, శక్తిని కోల్పోయి బలహీనపడి సొమ్మ సీలి పడిపోతారు. ముఖ్యంగా వేసవిలో వృద్ధులు, పిల్లలు ఎండ వేడిమిని తట్టుకోలేరు కావున వేసవి నుండి ఉపశమనం పొందుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పని పరిస్థితుల్లో ఎండలో తిరిగేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ, తలపాగా ధరించాలి ఈ వేసవిలో ప్రతి ఒక్కరు వేసవి జాగ్రత్తలు పాటించాలి.