
Dr. Mounika seasonal diseases.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
#నెక్కొండ ,నేటి ధాత్రి:
మండలంలోని గొట్లకొండ గ్రామపంచాయతీ లోని బడి తండాలో వరంగల్ కలెక్టర్ మరియు డి ఎం హెచ్ ఓ ఆదేశాల మేరకు డాక్టర్ల మౌనిక, తన్వీర్, సుమన్ ల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ వర్షాకాలంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చేస్తాయని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఏమాత్రం జ్వరంగా అనిపించిన వెంటనే రెడ్లవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి గాని నెక్కొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి గాని వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో గొట్లకొండ గ్రామపంచాయతీ సెక్రటరీ దేవేందర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.