
వెంటనే 1930 కాల్ చేసి వివరాలు తెలుసుకోండి
శాయంపేట నేటి ధాత్రి:
సైబర్ మూసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రమోద్ కుమార్ అన్నారు. నిన్న తన ఫోన్ పేస్ బుక్ చూస్తుంటే దని అనే లోన్ ఆప్ గురించి వస్తే, లోన్ తీసుకోవ డానికి కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అని ఉంటే, కాల అనే ఆప్షన్ మీద అతను క్లిక్ చేసేసరికి, సదరు ఆప్ వాళ్లకు కాల్ కనెక్ట్ అయింది. ఆప్ సంబంధించిన వాళ్ళు లోన్ ప్రాసెసింగ్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ పలుమార్లు అతని వద్ద 57000/- బ్యాంక్ అకౌంట్ ఫోన్ పే ద్వారా కొట్టించుకున్నారు. అయినా కూడా లోన్ శాంక్షన్ చేయకుండా ప్రాసెసింగ్ ఫీస్ చెల్లించాలంటూ ఇంకా డబ్బులు అడుగుతుంటే, సదరు కోటి అనే వ్యక్తి మోసపోయానని తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి జరిగే విషయాన్నీ తెలపడం జరిగింది వెంటనే పోలీసు వారు జరిగిన సైబర్ మోసాన్ని అతనికి వివరించి 1930 కాల్ చేసి మోసానికి సంబంధించిన వివరాలను సైబర్ ఫోటోలో నమోదు చేశారు.ఈ సందర్భంగా శాయంపేట మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా.
ఫేస్ బుక్ గాని ఇంస్టాగ్రామ్ లో గాని ఇంకా ఏ విధమైన సోషల్ మీడియా అకౌంట్లో గాని ఏవైనా నెంబర్స్ ఇచ్చి వాళ్ళు మీకు ఏదైనా డబ్బులు ఆశ చూపి మిమ్మల్ని డబ్బులు పంపించ మంటే ఎవరు పంపించ కూడదని తెలపడం జరిగింది వీటిని సైబర్ మోసాలు అంటారు. శాయంపేట మండల ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కి కాల్ చేసి మోసానికి సంబంధించిన వివరాలను జరిగిన గంటలోపే సైబర్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేస్తే మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కు పోయిన డబ్బులు వెంటనే హోల్డ్ కావడం జరుగుతుంది. ఆ డబ్బులను కోర్టు ద్వారా బాధితులకు చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా సైబర్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా మీ మొబైల్ ఫోన్ వాడుకోవాలని తెలియజేయడం జరిగింది